మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాన్ని తొలగిస్తున్న సమయంలో, స్తంభం పక్కనే ఉన్న భాగ్యనగర్ గ్యాస్ పైప్‌లైన్‌కు తగలడంతో అది పగిలిపోయింది. దీంతో భూమిలో నుంచి గ్యాస్ ఎగసిపడి, ఆ ప్రాంతంలో తీవ్రమైన వాసన వ్యాపించింది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. స్థానికులు వెంటనే గ్యాస్ కంపెనీకి సమాచారం ఇవ్వడంతో, వారు వచ్చి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa