ఉప్పల్ రామంతపూర్ గోఖలే నగర్‌లోని శ్రీ కృష్ణాష్టమి వేడుకల ఊరేగింపులో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. రథంను తోసుకుంటూ వెళ్తున్న సమయంలో విద్యుత్ తీగలు తాకడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే 5 మంది మృతి చెందారు. కృష్ణ యాదవ్(24), శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34), రుద్ర వికాస్(39), రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. కాగా ఈ ఘటనలో గాయపడిన మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.రామంతాపూర్ లో జరిగిన ఘటనలో ఆరో వ్యక్తి గణేష్ మృతి చెందడంతో మొత్తం ఆరుగురు మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కేబుల్ వైర్ల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో చర్చించి మృతులు, గాయపడిన వారికి నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటామని విద్యుత్ శాఖ సీఎండి ముషారఫ్ అలీ ఫరూకి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa