ఆధునిక భారత రూపకర్త, ఐటీ విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 81వ జయంతిని బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాలేఖ్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ ఐటీ రంగంలో చేసిన విశేష కృషి ఫలితంగానే దేశం నేడు సాంకేతిక రంగంలో దూసుకుపోతోందని, ఆయన ముందుచూపు, పట్టుదల, అంకితభావమే దీనికి కారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa