ప్రస్తుతం నడుస్తున్నదంతా ఐటీ హవా. చాలా కంపెనీలు ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అయితే సరైన నైపుణ్యాలు లేకపోవటంతో బీటెక్‌లు, ఎంటెక్‌లు పూర్తి చేసినా ఉద్యోగాలు లభించటం లేదు. ఎదైనా ఐటీ కంపెనీలో ఓపెన్స్ ఉన్నాయని తెలిస్తే.. వేల మంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. అయినా కూడా కొందరికి ఉద్యోగాలు లభించటం లేదు. దీంతో చాలా మంది యువత నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు.
అలాంటి తరుణంలో ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ ఇంటర్ విద్యార్థులకు సువర్ణావకాశం కల్పించింది. తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం టెక్‌బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్‌తో సంబంధం లేకుండా నేరుగా ఐటీ రంగంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో శిక్షణ, ఇంటర్న్‌షిప్‌తో పాటు, హెచ్‌సీఎల్‌లో పూర్తి స్థాయి ఉద్యోగం కూడా పొందవచ్చు.
ఎంపిక ప్రక్రియ ఇలా..
ఈ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే అభ్యర్థులు ముందుగా హెచ్‌సీఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CAT) లో అర్హత సాధించాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
అయితే ఈ ప్రోగ్రామ్ ఉచితం కాదు. నిర్దిష్ట ప్రోగ్రామ్‌ను బట్టి రూ. 51 వేల నుంచి రూ. 2.34 లక్షల వరకు ట్యూషన్ ఫీజు ఉంటుంది. ఐటీ సర్వీసెస్/ అసోసియేట్‌కు ఎంపికైనవారు బ్యాంకు నుంచి రుణ సౌకర్యం పొందవచ్చు. శిక్షణ అనంతరం సులభవాయిదాల్లో దీన్ని చెల్లించుకోవచ్చు.
ఈ ప్రోగ్రామ్ మొత్తం 12 నెలల పాటు ఉంటుంది. ఇందులో అభ్యర్థులకు టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలపై విస్తృత శిక్షణ ఇస్తారు.
శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు దాదాపు రూ.10 వేల వరకు స్టైపెండ్ లభిస్తుంది. ఇది వారి ఆర్థిక అవసరాలకు తోడ్పడుతుంది.
ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి హెచ్‌సీఎల్‌లో ఐటీ సర్వీసెస్ అసోసియేట్ వంటి పోస్టులలో ఉద్యోగం లభిస్తుంది. ఈ ఉద్యోగంలో వార్షిక వేతనం రూ.1.7 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉంటుంది. మెడికల్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ మొదలైన ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.
ఈ ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్థులు ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు కొనసాగించే అవకాశం ఉంది. బిట్స్ పిలానీ, ఎమిటీ యూనివర్సిటీ, శాస్త్ర యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయవచ్చు.
హెచ్‌సీఎల్ టెక్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ సుబ్బరామన్ ఈ ప్రోగ్రామ్ యువతకు ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. ఇంటర్ తర్వాత ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు హెచ్‌సీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తి కలిగిన ఇంటర్ స్టూడెంట్ ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుబ్బరామన్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa