TS: హైదరాబాద్ వైద్యులు మరో అద్భుతం చేశారు. కేవలం 23 వారాలకు, అర కిలో బరువుతో పుట్టిన ఓ పసికందుకు దాదాపు 4 నెలల పాటు వైద్యం చేసి బతికించారు. సూడాన్‌కు చెందిన ఇన్సాఫ్, షాకీర్ దంపతులు ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చారు. ఆమెకు ఏప్రిల్ 18న 565 గ్రాముల బరువుతో 23 వారాలకే శిశువు జన్మించింది. ఈ శిశువును కాపాడేందుకు హైటెక్ సిటీ మెడికవర్ వైద్యులు శ్రమించారు. 115 రోజుల పాటు వైద్యం చేసి పసికందును బతికించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa