సోమందేపల్లి మండల కేంద్రంలోని నక్కల గుట్టలో శుక్రవారం యాదవ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని గుడి నిర్మాణ భూమి పూజ జరిగింది. ఈ వేడుకలకు సోమందేపల్లి తహసీల్దార్ మారుతి, ధర్మవరం సీఐ శ్రీనివాసులు హాజరయ్యారు. శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కుల బాంధవులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa