రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర శుక్రవారం చొప్పదండి మండలం కాట్నపల్లిలో అధికారులు ప్రారంభించారు. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎంపిడివో వేణుగోపాల్ రావు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపివో రాజగోపాల్ రెడ్డి, గ్రామ ప్రత్యేక అధికారి సతీష్, కొండగట్టు ఉత్సవ కమిటీ ఛైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు చుప్ప శ్రీనివాస్, కొత్తపల్లి నవీన్, మాజీ సర్పంచ్ గన్ను శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa