టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్-తిరుపతి మధ్య తిరిగే లహరి, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఛార్జీలు తగ్గించింది. లహరి ఏసీ, రాజధాని ఏసీ బస్ ఛార్జీల్లో 10%, సూపర్ లగ్జరీ బస్ ఛార్జీల్లో 15% డిస్కౌంట్ ఇస్తున్నట్లు శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. తిరుమల శ్రీవారి దివ్య దర్శనానికి వెళ్లే ప్రయాణికులు ఈ ఆఫర్ ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa