జహీరాబాద్‌లో ఆదివారం ఉదయం హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో 169వ నగర సంకీర్తన అట్టహాసంగా జరిగింది. శ్రీరామ మందిరం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర శ్రీరామ్ మొహల్లా, నాగులకట్ట రోడ్ల మీదుగా సాగింది. భక్తులు హరేకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ, మృదంగ వాద్యాల నాదంలో నృత్యాలు చేస్తూ భక్తిలో మునిగిపోయారు. స్వస్తిక్ రెస్టారెంట్ వారు భక్తులకు ఉప్పిట్ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ నెల 31న హనుమాన్ మందిర్ ప్రాంగణంలో తదుపరి నగర సంకీర్తన జరగనుంది. అదే రోజు హుగ్గెల్లి గ్రామంలో 134వ పల్లె సంకీర్తన కూడా ఘనంగా నిర్వహించబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa