TG: రాష్ట్రంలో పారిశుద్ధ్యం లోపించిందని, ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో ఆయన పర్యటించారు. వైరల్ జ్వరాలతో చనిపోయిన మహేశ్ (35), శ్రవణ్ (15) కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తిమ్మాపూర్‌లో డెంగీ తో ఇద్దరు చనిపోయారని, మరో 50 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa