పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ వాహనాల (ఈవీలు) వాడకం గణనీయంగా పెరిగింది. అయితే.. దేశంలో ఛార్జింగ్ స్టేషన్ల కొరత ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ( జీహెచ్‌ఎంసీ ) మరియు తెలంగాణ రెడ్కో కలిసి కీలక నిర్ణయం తీసుకున్నాయి. వారు నగరంలో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటును వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే 71 ప్రభుత్వ ఛార్జింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి.. మరో 10 కేంద్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ కేంద్రాల వల్ల పర్యావరణానికి , ఆర్థికంగా కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈవీల ఛార్జింగ్ ఖర్చు పెట్రోల్ ధరల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఒక గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఛార్జింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉండటం వల్ల దూర ప్రయాణాలు చేసే వారికి కూడా ఇబ్బందులు ఉండవు. ఈ కొత్త మౌలిక వసతుల కల్పన వల్ల భవిష్యత్తులో ఈవీల తయారీ, ఇతర అనుబంధ రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి.
ప్రభుత్వం "Charge green, drive clean" అనే నినాదంతో హైదరాబాద్‌ను 'జీరో కార్బన్ సిటీ'గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు సుమారు 23 లక్షల యూనిట్ల విద్యుత్తు ఈ కేంద్రాల ద్వారా వాడబడింది. మల్కం చెరువు, IIIT, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు , డెలాయిట్, BHEL-MIG కాలనీ వంటి ప్రాంతాలలో ఈ కేంద్రాలను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa