TG: భద్రాచలంలో ఓ 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. ఆ బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన బాలికగా పోలీసులు గుర్తించారు. ఆ బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు శనివారం చర్ల మండల కేంద్రానికి వచ్చింది. అక్కడ వాజేడు ప్రాంతానికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన సమయంలో అందులో ఉన్న ఇతర డ్రైవర్లు ఆమెకు కూల్‌డ్రింగ్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa