సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డి పల్లి కొత్లాపూర్ రోడ్డు, హనుమాన్ మందిరం వద్ద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శ్రీరామ్ శాఖ రుద్రారం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, జల వనరులను కాపాడటానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, వీటికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa