యాదాద్రి భువనగిరి జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. భూదాన్ పోచంపల్లిలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన పోతగల్ల సతీష్(38) ఓ గణేశ్ మండపం వద్ద పని చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మండపం పైకి ఎక్కి తార్పాలిన్ కవర్ కప్పుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి సీసీరోడ్డుపై పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa