సంగారెడ్డి మున్సిపల్ కార్మికులకు గురువారం వాసవి మా ఇల్లు సంస్థ ఆధ్వర్యంలో రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, కార్మికులకు రెయిన్ కోట్లు అందించడం అభినందనీయమని తెలిపారు. సంస్థ వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ 150 మంది కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోపాజి హరీష్, రాధా కిషన్, బుచ్చి లింగం, విద్యాసాగర్, అమేటి కిట్టు, నామ భాస్కర్ కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa