గత నెల 26న చౌటుప్పల్ మండలం ఖైతాపూరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏఎస్పీ ప్రసాద్ చికిత్స పొందుతూ మరణించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు డీఎస్పీలు చక్రధరరావు, శాంతరావు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్పీ ప్రసాద్‌ను హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. నెల రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa