TG: అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. BRS నుంచి పార్టీ మారిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వంత గూటికి చేరే అవకాశం కనిపిస్తోంది. BRSను వదిలిపెట్టినందుకు తనకు బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించడమే ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. కాంగ్రెస్ తో తాను యాక్టివ్ లేనని, కాంగ్రెస్ పనుల గురించి ప్రజలతో చెప్పుకోలేకపోతున్నానని అన్నారు. BRS హయాంలో యూరియా కొరత లేదని చెప్పుకొచ్చారు. BRS హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఈయన పనిచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa