కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001-02 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ముదిరాజ్ ఫంక్షన్ హల్లో ఘనంగా జరిగింది. 23 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉపాధ్యాయులు సుధాకర్, భూమాచారి, ప్రేమనందం, లక్ష్మి నర్సయ్యలను శాలువాలతో సత్కరించారు. అనంతరం ఒకరికొకరు గత స్మృతులను గుర్తు చేసుకుంటూ, ఆటపాటలతో సంతోషంగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa