TG: మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ఈ విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా, SMలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఓ జర్నలిస్టుతో ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియోను విడుదల చేశారు. అందులో మాదిగలంటే అంతా చిన్నచూపా అని ఇండైరెక్ట్‌గా మంత్రి పొన్నం, వివేక్‌లను ప్రశ్నించారు. తనను అన్న మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ రేపటిలోగా క్షమాపణ కోరితే ఆయనకు గౌరవం ఉంటుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa