ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్స్యకారుని వలకు చిక్కిన అరుదైన చేప

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 02:00 PM

సంగంబండ్‌ గ్రావిటీ కెనాల్‌లో మత్స్యకారుడు మామిళ్ల బాలస్వామి వలకు అరుదైన రెడ్‌ బెల్లిడ్‌ ప్యాకు పిరానా చేప చిక్కింది. దక్షిణ అమెరికా అమెజాన్‌ జలాల్లో కనిపించే ఈ చేప దంతాలతో మొక్కలు, పండ్లు, చనిపోయిన జంతువుల అవశేషాలను ఆహారంగా తీసుకుంటుంది. ఇతర చేపలకు ముప్పుగా ఉండటంతో వీటిని జలాశయాల్లో పెంచడాన్ని నిషేధించారు. సుమారు కిలో బరువున్న ఈ అరుదైన చేప మార్కెట్లో అధిక విలువ కలిగినదిగా మత్స్యకారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa