ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన అమెజాన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 03:36 PM

ముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి సంస్థలోని మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగంలో దాదాపు 15 శాతం మంది ఉద్యోగులపై వేటు వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫార్చ్యూన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెజాన్‌లో హెచ్‌ఆర్ విభాగాన్ని 'పీపుల్ ఎక్స్‌పీరియన్స్ టెక్నాలజీ (పీటీఎక్స్)' గ్రూప్‌గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో 10,000 మందికి పైగా పనిచేస్తున్నారు. తాజా తొలగింపుల ప్రభావం ప్రధానంగా వీరిపైనే ఉండనుంది. హెచ్‌ఆర్‌తో పాటు ఇతర వినియోగదారుల వ్యాపార విభాగాల్లోనూ ఉద్యోగాల కోత ఉండే అవకాశం ఉందని సంస్థ అంతర్గత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ నిరాకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa