రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం సంతాపూర్ గ్రామ శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట నుండి సంతాపూర్ గ్రామానికి వెళుతున్న కోడి దాణా లోడుతో ఉన్న డీసీఎం వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్ బి. అంజయ్య సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa