నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేవరకొండ మండలంలోని కొమ్మేపల్లి గ్రామంలో 'సంఘటన్ సృజన్ అభియాన్ – తెలంగాణ' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన నాయకత్వాన్ని ప్రజల ద్వారానే ఎంపిక చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని, ఈ స్ఫూర్తితో ఏఐసీసీ పరిశీలకులు తెలంగాణలోని ప్రతి జిల్లాలో నాయకులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరిస్తున్నారని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa