స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో, ఈ నెల 18న బీసీల బంద్ నిర్వహించాలని బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి సతీష్ గౌడ్ పిలుపునిచ్చారు. దేవరకొండలో గురువారం ఆయన మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ బంద్‌కు విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యువజన, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa