తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాలో బంగారం పోయిందని వచ్చిన దంపతుల సంసారంలో మాంత్రికుడు చిచ్చు పెట్టాడు. పోయిన బంగారం ఎవరు ఎత్తుకెళ్లారని మంత్రగాడు సురేష్ గౌడ్ ను రాము అతని భార్య మానస సంప్రదించారు. తరచూ ఈ విషయంలో భార్య మాంత్రికుడుని కలవడంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో మందలించాడు. ఇతడి అడ్డు తొలగించుకోవాలని మద్యం తాగేందుకు పిలిచి చంపి ఆతర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. పోలిసుల దర్యాప్తులో ఈ ఘటన వెలుగు చూసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa