దీపావళి పండుగ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్ దంపతుల సహకారంతో, బాపూజీ నగర్ 7, 21 వ వార్డులలోని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఆదివారం నూతన వస్త్రాలు అందజేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ సేవ కొనసాగిందని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, వేకువ జామున లేచి ఎండ, వాన అనకా నిత్యం విధులు నిర్వహిస్తున్న కార్మికుల శ్రమను మరువలేమని ఆయన కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa