తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ వస్త్ర వ్యాపార సంస్థలైన సీఎంఆర్, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త చందన మోహనరావు (82) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, విశాఖపట్నంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.చందన మోహనరావు తన వ్యాపార దక్షతతో సీఎంఆర్, చందన బ్రదర్స్ బ్రాండ్లను తెలుగు ప్రజలకు చేరువ చేశారు. ఆయన స్థాపించిన ఈ షాపింగ్ మాల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక నగరాలు, పట్టణాల్లో విస్తరించి, వస్త్ర వ్యాపార రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.నాణ్యత, విభిన్న రకాల వస్త్రాలకు చిరునామాగా నిలిచిన ఈ సంస్థలు, ముఖ్యంగా మహిళా వినియోగదారుల ఆదరాభిమానాలను విశేషంగా చూరగొన్నాయి. మోహనరావు మరణ వార్త తెలియగానే వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa