బీబీపేట మండలంలోని పెద్దమ్మ ఆలయం వద్ద ముదిరాజ్ ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల సహకారంతో బండ్ల బోనాలు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సోదరులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, కులమతాలకు అతీతంగా మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. ఎస్సై ప్రభాకర్ పర్యవేక్షణలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేసి, పండుగను సజావుగా ముగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa