కూసుమంచి మండలంలోని పెరికసింగారం గ్రామంలో వరి కోతలు బుధవారం ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య పలువురు రైతుల పొలాలను సందర్శించి, వరి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతులతో విత్తన రకం, దిగుబడి, ఎరువుల వాడకం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, ఏఈఓ నవీన్, రవీందర్, వంశీకృష్ణ, సౌమ్య, ప్రియాంక, మరియు రైతులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa