తూప్రాన్ పట్టణ హైవే బైపాస్ రోడ్డులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఓ ప్రయివేటు స్కూల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చేగుంట మండలం, పెద్దశివునూర్కు చెందిన బండారి దుర్గయ్య (55) అక్కడికక్కడే మృతిచెందాడు. తూప్రాన్ మండలం కిష్టాపూర్ వాసి బోండ్ల స్వామి (50) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa