రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను అక్టోబర్ 9న ఈసీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. దీనిని సవాలు చేస్తూ న్యాయవాది సురేందర్ TG హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం తెలిపేందుకు మరింత గడువు కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa