ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినియోగదారుల ఫోరం సంచలనాత్మక తీర్పు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 10:39 AM

2018లో నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌లో ప్రసూతి సమయంలో గర్భిణి స్వాతి మృతి చెందిన కేసులో, బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలని నల్లగొండ జిల్లా వినియోగదారుల ఫోరం హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. 9 జూలై 2018న ప్రసూతి కోసం ఆసుపత్రిలో చేరిన స్వాతికి 13వ తేదీ రాత్రి సర్జరీ జరిగింది. రెండుసార్లు మత్తు మందు ఇవ్వడం వల్ల వైద్యం వికటించి 14వ తేదీన ఆమె మృతి చెందింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఫోరం ఈ తీర్పు వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa