కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో జవిడి రఘుపతి రెడ్డి (35) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గుజరాత్ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ అతివేగంతో వచ్చి బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఎస్ఐ నవీన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa