హైదరాబాద్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ ‘సఫ్రాన్ ఏర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్’ కొత్త అత్యాధునిక సర్వీస్ సెంటర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కేంద్రం తెలంగాణను భారత ఏరోస్పేస్, రక్షణ రంగంలో కీలక హబ్‌గా మార్చే మైలురాయిగా సీఎం అభివర్ణించారు. దీనితో రాష్ట్రంలో ఉన్నతస్థాయి టెక్నాలజీ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రూ.13 వేల కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమైన ఈ సెంటర్ ద్వారా స్థానిక చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు (MSMEలు), ఇంజినీరింగ్ కంపెనీలకు అపారమైన వ్యాపార అవకాశాలు ఏర్పడతాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంస్థ ద్వారా లీప్ ఇంజన్ల నిర్వహణ, మరమ్మత్తు సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో దేశంలోనే తొలిసారిగా భారత్‌లోనే ఈ అత్యాధునిక ఇంజన్ల సర్వీసింగ్ జరగనుంది.
ప్రస్తుతం బెంగళూరు-హైదరాబాద్ మధ్య ఏర్పడుతున్న డిఫెన్స్ & ఏరోస్పేస్ ఎకోసిస్టమ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మార్గాన్ని అధికారికంగా ‘నేషనల్ డిఫెన్స్ & ఏరోస్పేస్ కారిడార్’గా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం కోరారు. ఈ కారిడార్ ఏర్పాటు దక్షిణ భారత రక్షణ రంగానికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణలో గత రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిన నేపథ్యంలో ఈ సఫ్రాన్ సెంటర్ మరో ఘనతను అద్దింది. రాష్ట్ర పారిశ్రామిక విధానం, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షిస్తున్నాయన్న సంకేతంగా ఈ ప్రారంభోత్సవం నిలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa