తెలంగాణలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42 % రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బీజేపీ 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa