బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‍కు నాయకత్వ లక్షణాలు లేవని, అందుకే నేతలంతా పార్టీకి దూరం అవుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులే హరీశ్ రావు పని చేస్తారని, ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలవుతుందని శ్రీహరి జోస్యం చెప్పారు. జనగామలో మాట్లాడిన ఆయన, అహంకారం, బలుపుతో మాట్లాడితే నాయకుడు కాలేరని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే కేటీఆర్ పై 10 కేసులున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa