ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ ఉత్తమ వంటకాలలో హైదరాబాద్ బిర్యానీకి 10వ స్థానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 27, 2025, 03:28 PM

TG: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ బిర్యానీ.. టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని ఉత్తమ 50 రైస్ వంటకాల జాబితాలో భారత్ నుంచి ఏకైక వంటకంగా 10వ స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో జపాన్ వంటకాలు అధికంగా చోటు దక్కించుకున్నాయి. హైదరాబాద్ బిర్యానీని కచ్చీ పద్ధతిలో, అంటే బియ్యం, మాంసాన్ని మసాలాలతో కలిపి ఒకేసారి ఉడికించడం ద్వారా ప్రత్యేక రుచిని అందిస్తారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ ర్యాంకింగ్‌పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa