హైదరాబాద్ నాచారం ప్రాంతంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ముందుకు వచ్చింది. డిఫెన్స్ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా గుర్తింపు పొందిన ఈ ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొందే అవకాశం ఇది యంగ్ ఇంజినీర్లకు బంపర్ ఆఫర్‌లా కనిపిస్తోంది. బీఈ, బీటెక్, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు, రాత పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యే సౌలభ్యం ఉండటం ప్రత్యేక ఆకర్షణ.
ఇంటర్వ్యూ డేట్ డిసెంబర్ 9, 2025న నిర్ణయించారు. ఉదయం 8.30 గంటల నుంచి నాచారంలోని BEL యూనిట్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరుగనుంది. అభ్యర్థులు తమ బయోడేటా, అన్ని విద్యా ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఒరిజినల్ & జిరాక్స్ కాపీలతో సమయానికి చేరుకోవాలి. ఎటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ అవసరం లేకపోవడం వల్ల ప్రక్రియ చాలా సులువుగా సాగనుంది.
వయసు పరిమితి 25 ఏళ్లలోపు ఉండాలి. అయితే SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC (NCL) అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయసు సడలింపు వర్తిస్తుంది. గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఇప్పటికే ఏదైనా సంస్థలో గ్రాడ్యుయేట్ లేదా టెక్నీషియన్ అప్రెంటిస్‌గా శిక్షణ పూర్తి చేసిన వారు ఈ నోటిఫికేషన్‌కు అనర్హులుగా పరిగణించబడతారు.
మరిన్ని వివరాలు, బ్రాంచ్‌ల వారీగా అర్హతలు, స్టైపెండ్ సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://bel-india.in/ ను సందర్శించండి. డిఫెన్స్ సెక్టార్‌లో కెరీర్ ప్రారంభించాలనుకునే యంగ్ టాలెంట్‌కు ఇది అద్భుతమైన ప్లాట్‌ఫాం – ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa