గురువారం తూప్రాన్ పరిధిలోని అల్లాపూర్ శివారు వద్ద ఉన్న టోల్ ప్లాజాలో వాహన తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులు, పాశమైలారం నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 285.70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ విషయాన్ని విజిలెన్స్ డీఎస్పీ రమేష్ వెల్లడించారు. నమ్మదగిన సమాచారం ఆధారంగా చేపట్టిన ఈ తనిఖీల్లో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకొని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa