సోమవారం దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌకుంట్ల మండలానికి చెందిన సాలె బలరాజు అనే కూరగాయల వ్యాపారి టీవీఎస్ బైక్, లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దేవరకద్ర నుండి కౌకుంట్ల వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతునికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa