హైదరాబాద్‌లోని టెక్ విద్యార్థులు, క్రియేటర్లు 'కేఫ్ కల్చర్'ను తమ కొత్త కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. పగటిపూట లాప్‌టాప్‌లతో కో-వర్కింగ్ సెంటర్లుగా ఉపయోగించుకుంటూ, రాత్రిపూట బోర్డ్ గేమ్స్, ఓపెన్ మైక్స్, ఇండీ మ్యూజిక్ గిగ్స్‌తో సందడి చేస్తున్నారు. పబ్‌లకు భిన్నంగా, ఈ హాట్‌స్పాట్‌లు వైన్-డైన్‌కు బదులుగా కాఫీ, ఫుడ్‌తో యువతను ఆకర్షిస్తున్నాయి. మద్యం లేకుండానే సృజనాత్మకత, కమ్యూనిటీతో ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. దీనినే 'స్టడీ పార్టీ' అని పిలుస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa