తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది. ఈ మేరకు రానున్న రెండు మూడు రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 - 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మరీ ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. గత కొన్ని రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోవడంతో రాష్ట్రం అంతటా చలి తీవ్రత విపరీతంగా పెరిగిందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa