కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో 44వ హైవేపై ఆగి ఉన్న టిప్పర్‌ను ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీకి చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ శ్రావణ్ కుమార్ తలకు తీవ్ర గాయాలవడంతో అతన్ని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. బస్సు స్టాఫ్‌ను ఎక్కించుకోవడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సు ముందు భాగం ధ్వంసమైనా, అందులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa