జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50) తన భార్య సంధ్యను ఉరి వేసి హత్య చేశాడు. ఆ తరువాత భార్య, కూతురు వేధింపులు తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డానంటూ ఒక వీడియోను రికార్డ్ చేసి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాడు. అనంతరం తానూ ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa