TG: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీలపై దాఖలైన పిటిషన్లపై ఈ నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఈ ప్రకటన చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa