రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రేషన్‌కార్డు దారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డులకు నూతన సంవత్సరం నుంచి సన్నబియ్యం కోటా నిలిపివేయనున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరుగుతోంది. కుటుంబ సభ్యులంతా సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఐదేళ్ల లోపు పిల్లలకు మినహాయింపు ఉంది. రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ-కేవైసీని ఇంకా పెద్ద సంఖ్యలో కార్డుదారులు అప్డేట్ చేసుకోలేదని అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉండటంతో, గడువులోపు ఈ-కేవైసీ చేయించుకోని వారికి రేషన్ బియ్యం పంపిణీ ఉండదని హెచ్చరించింది. రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని, సమాచారం తెలియజేసే ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa