సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని, అవసరాన్ని బట్టి ఈ సీజన్ మొత్తంలో జంట నగరాల నుంచి సుమారు 600 వరకు ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి నడవనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa