తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఎంతో కాలంగా నిలిచిపోయిన విద్యార్థుల ఉపకార వేతనాలు , ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం సోమవారం నాడు విడుదల చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యవేక్షణలో ఆర్థిక శాఖ మొత్తం రూ. 365.75 కోట్ల నిధులను సంక్షేమ శాఖలకు విడుదల చేసింది. ఏ శాఖకు ఎంత కేటాయించారో ఇక్కడ తెలుసుకోండి.
ఎస్సీ సంక్షేమ శాఖకు.. షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం అత్యధికంగా రూ. 191.63 కోట్లు మంజూరు చేశారు. గిరిజన సంక్షేమ శాఖకు.. ఎస్టీ విద్యార్థుల అవసరాల నిమిత్తం రూ. 152.59 కోట్లు విడుదలయ్యాయి. బీసీ సంక్షేమ శాఖకు.. వెనుకబడిన తరగతుల విద్యార్థుల బకాయిల కోసం రూ. 21.62 కోట్లు కేటాయించారు. ఈ నిధుల విడుదలతో గత ప్రభుత్వం నుండి పెండింగ్‌లో ఉన్న మెజారిటీ బకాయిలు పరిష్కారమైనట్లు అధికార యంత్రాంగం చెబుతోంది.
చాటుకున్నామన్నారు. రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి ఉన్నప్పటికీ.. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిధులను సర్దుబాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను తాము ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేస్తున్నామని వివరించారు. దీనివల్ల హాస్టల్లో ఉండేవారికి, కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు పెద్ద ఊరట లభించనుంది.
ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే కాకుండా.. విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టింది. హాస్టల్ విద్యార్థులకు అందించే భోజన వసతి, మెస్ చార్జీల విషయంలో కూడా ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోనుంది. కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకుండా ఉండేందుకు ఈ బకాయిల విడుదల ఎంతో కీలకంగా మారనుంది. మంజూరైన నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి లేదా సంబంధిత విద్యా సంస్థలకు జమ అయ్యేలా పారదర్శకమైన చర్యలు తీసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa