శంషాబాద్‌ను చార్మినార్ జోన్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శంషాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల్లో భాగంగా, జేఏసీ నేతలు శంషాబాద్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో భాగంగా విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. కొన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. అయితే, బంద్‌లో పాల్గొనని కొన్ని వ్యాపార సముదాయాలను జేఏసీ నేతలు బలవంతంగా మూసివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa