కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో 'వికసిత భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)' అనే నూతన చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త చట్టంలోని నిబంధనలు, శ్రామికుల హక్కులు, ఇతర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa